ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శనివారం అలంపూర్ సివిల్ కోర్టు జడ్జి నితిన్ తేజ సందర్శించి.. అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను అర్చకుడు సందీప్ చారి వివరించారు. న్యాయమూర్తి వెంట కోర్టు సిబ్బంది ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,519
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 256 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,519, కనిష్టంగా రూ. 4,169, సరాసరి రూ. 6,399 ధరలు లభించాయి. 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,219, కనిష్టంగా రూ. 4,579 ధర పలికింది.


