శనేశ్వరుడికి తైలాభిషేకాలు | - | Sakshi
Sakshi News home page

శనేశ్వరుడికి తైలాభిషేకాలు

Aug 23 2026 1:40 AM | Updated on Aug 23 2026 1:40 AM

కందనూలు: నందివడ్డేమాన్‌ జ్యేష్టాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణమాసం శుక్లపక్షం జేష్ట మూలనక్షత్రం సందర్భంగా ఆలయ పూజారి గవ్వమఠం విశ్వనాథ శాసీ్త్ర మంత్రోచ్ఛరణల మధ్య శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరమశివుడిని దర్శించుకుని.. రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధన, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చన పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ వెల్దండ గోపాల్‌రావు, సర్పంచ్‌ సుగుణమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement