మానవపాడు: పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాకుండా.. ప్రజల పట్ల ఉన్న బాధ్యత, సేవాభావం, చట్ట పరిరక్షణ అధికారాల సమన్వయంతో కూడిన పవిత్రమైన సేవ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి.. స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బారెక్స్, స్టేషన్ రికార్డుల మెయింటెన్స్, మెన్ యూనిఫాం టర్నౌట్, కిట్ ఆర్టికల్స్, స్టేషన్ రికార్‌ుడ్స, పరిసరాలను తనిఖీ చేశారు. ఆవరణలో ఉన్న, స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని, బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బంది ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. రౌడీ, సస్పెక్ట్, హిస్టరీ షీటర్లను చెక్ చేస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పాపిలోన్ డివైస్‌ను వినియోగించి అనుమానితుల వేలిముద్రలను చెక్ చేస్తూ పాత నేరస్తులను గుర్తించాలని, సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీసీటీఎన్‌ఎస్–2.0, టీఎస్ సీఓపీ, ఈ–సాక్ష్య, సీఈఐఆర్, ఐఆర్‌ఏడీ, డ్రాపాన్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ ఓన్ కెమెరాల సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై పూర్తిస్థాయిలో పట్టు సాధించి నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శంకర్, ఎస్‌ఐ స్వాతి తదితరులు పాల్గొన్నారు.


