రేపు ఉద్యోగ మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు ఉద్యోగ మేళా

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

గద్వాల: కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ ప్రశాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగి.. ఎస్సెస్సీ, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, బీకాం విద్యార్హత కలిగిన వారితో పాటు హోటల్‌, హాస్పిటల్‌ రంగాల్లో అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. మేళాలో ఎంపికై న వారికి జిల్లా కేంద్రంతో పాటు, అయిజ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లోని పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

25న వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ

గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 38 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఒక ట్యూటర్‌ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈ నెల 25న వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత, అనుభావాలకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్‌ పత్రులతో ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. పోస్టుల వివరాలు, వయోపరిమితి వేతనం తదితర పూర్తి నిబంధనల కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ www.gadwal.telangana.gov.inను పరిశీలించాలని కలెక్టర్‌ కోరారు.

వైద్యసేవల్లో

నిర్లక్ష్యం వహించొద్దు

మల్దకల్‌: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని డీఎంహెచ్‌ఓ సంధ్యాకిరణ్మయి సిబ్బందికి సూచించారు. మంగళవారం మల్దకల్‌ పీహెచ్‌సీలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని గ్రామాలలో వారానికి రెండు మార్లు డ్రై డే కా ర్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఫీవర్‌ సర్వే ద్వారా విషజ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి.. ఆరోగ్యకేంద్రాలకు పంపించా లని సూచించారు. డీఎంహెచ్‌ఓ వెంట డాక్టర్లు ఉషారాణి, జయమ్మ, డీపీహెచ్‌ఎన్‌ వరలక్ష్మి, సూపర్‌వైజర్లు శ్రీధర్‌, సత్యమ్మ ఉన్నారు.

పల్లీ క్వింటా రూ.8,119

గద్వాలవ్యవసాయం: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 92 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,119, కనిష్టంగా రూ. 5,380, సరాసరి రూ. 7,682 ధరలు పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement