అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు | - | Sakshi
Sakshi News home page

అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

లింగాల: మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణ, సెక్షన్‌ ఆఫీసర్‌ రాంబాబు ఇటీవల లంచం తీసుకున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉద యం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలో అద్దెకు ఉన్న ఓ అధి కారి ఇంట్లో సైతం సో దాలు చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ.. గత జూలై 23న లింగాల మండలానికి చెందిన కొందరు రైతులు ఎడ్లబండ్లపై వ్యవసాయ పనిముట్లను తీసుకొని వస్తుండగా.. రేంజ్‌ పరిధిలోని కొర్రమడుగు సమీపంలో బీట్‌, సెక్షన్‌ ఆఫీసర్లు అడ్డుకొని డబ్బులు డిమాండ్‌ చేశారన్నారు. మొత్తం రూ. 1.50లక్షలు డిమాండ్‌ చేయగా.. రూ. 50వేలు ముందస్తుగా తీసుకున్నారని బాధిత రైతులు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ సీఐ జిలానీ, సిబ్బంది ఉన్నారు.

రైతుల నుంచి లంచం తీసుకున్న

ఇద్దరు అధికారుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement