గ్రామాల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

గ్రామాల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికలు

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

ధరూరు: గ్రామాల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సమ గ్ర అభివృద్ధి ప్రణాళిక అంశంపై మంగళవారం ధరూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గద్వాల నియోజకవర్గ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. గతంలో పనిచేసిన సర్పంచులకు ధీటుగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి.. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ముఖ్యంగా అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి సత్వర చర్య లు తీసుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రోగ్రాం ఇన్‌చార్జి సురేశ్‌బాబు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, స్వచ్ఛత పెంపొందించడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ.. గ్రామాభివృద్ధికి పాటుపడాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సూచించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్‌ చైర్మన్‌ గట్టుతిమ్మప్ప, డీపీఓ శ్రీకాంత్‌, డీఆర్డీఓ ము షాయిదా బేగం, డీఎల్‌పీఓ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమోహన్‌, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌, మాజీ వైస్‌ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు విజయ్‌, రమేశ్‌ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement