ఉప్పల్ క్యాంపులో కార్యాలయం ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది. ఆయకట్టు మొత్తం ఇక్కడ ఉండగా.. కార్యాలయం దూరాన ఉండటం ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదు. అధికారులు రైతులకు అందుబాటులో ఉన్నప్పుడే నీటి విడుదల, ఆయకట్టు సంరక్షణ చర్యలు వీలవుతుంది.
– లోకేశ్‌రెడ్డి, రైతు, చిన్నధన్వాడ
అందుబాటులో
ఉండాలనే డిమాండ్ ఉంది
ఆర్డీఎస్ కార్యాలయం ఉప్పల్ క్యాంపులోనే నిర్వహించాలనే డిమాండ్ ఉంది. ఆర్డీఎస్ రైతుల కోరికను ఉన్నతాధికారులకు తెలియజేశాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల డిమాండ్‌ను వినిపించాలని కోరాం. సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.
– రామదాసు, ఆర్డీఎస్ అధికారి
అనుకూలంగా ఉండేది..
ఉప్పల్ క్యాంపులో ఆర్డీఎస్ కార్యాలయం ఉన్నప్పుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి వెళ్లేవాళ్లం. నీటి విడుదల నిలిచినా, కెనాల్‌లో నీటి ఇబ్బందులు ఎదురైనా, నీటి చౌర్యం జరిగినా వెంటనే అధికారులను కలిసేవాళ్లం. కర్ణాటక నుంచి నీటి విడుదలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని గ్రామాల్లో రైతులకు తెలిపేవాళ్లం. అధికారులు కూడా రైతులను సులువుగా గుర్తుపట్టి.. తరచుగా సమావేశాలు నిర్వహించే వారు. – పరమేశ్‌గౌడ్, రైతు, పెద్ద ధన్వాడ
●


