మద్యం మత్తు.. ప్రాణాలు చిత్తు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తు.. ప్రాణాలు చిత్తు

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

గద్వాల క్రైం: ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు వీలైనంత వరకు వాహనదారుల్లో మార్పునకు కృషి చేస్తుంది. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం వేరు.. మత్తులో తూగుతూ ప్రమాదానికి గురైన సంఘటనలే జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. గత నెల 26న ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత మత్తులో కారు నడుపుతూ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేనంత వేగంగా నడుపుతూ ఎడమ వైపు వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వలస వచ్చిన ఓ యువకుడు అక్కడికక్కడే తల పగిలి మృతిచెందాడు. ప్రమాదం తర్వాత సదరు వ్యక్తి కారు ఆపకుండా అంతే వేగంగా వెళ్లిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఈ నెల 2న ఎస్పీ శ్రీనివాసరావు అర్ధరాత్రి ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

జిల్లాలో అత్యధికంగా ఈ కోవలోనే రోడ్డు ప్రమాదాలు

తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు వాహనదారులు

పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కనిపించని మార్పు

స్వయంగా అర్ధరాత్రి వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పటిష్ట చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement