గద్వాల చీరలకు ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఎప్పటికీ పోరాదన్న ఉద్దేశంతో చాలా ఇష్టంగా చీరలు నేస్తాం. చూడగానే ఇది గద్వాల చీర అని చెప్పేలా ఇక్కడి చీరలు ఉంటాయి. ఇప్పటి మహిళలు నచ్చే, మెచ్చే విధంగా పలు డిజైన్లతో చీరలు రూపొందిస్తున్నాం. గద్వాలకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి చీరల కొనుగోలుకు వస్తుంటారు.
– గోరంట్ల నాగలక్ష్మీ, చేనేత కార్మికురాలు, గద్వాల
ఆదరణ తగ్గలేదు..
గద్వాల జరీ, పట్టు చీరలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ చీరలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. జిల్లాలో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిలో ఉన్నాయి. కాలానుగుణంగా ఇక్కడి కార్మికులు చీరలను వివిధ రకాల డిజైన్‌లలో నేస్తున్నారు. రంగుల ఎంపికల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాపారులు పవర్‌లూం చీరలకు బదులుగా హ్యండ్లూమ్ చీరలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– మేడం రామకృష్ణ, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
●


