విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Aug 7 2026 1:26 AM | Updated on Aug 7 2026 1:26 AM

గద్వాలన్యూటౌన్‌: నియోజకవర్గంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులకు నోట్‌, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అంతకు ముందు ఎంపీసీలో 470 మార్కులకు గాను 468 సాధించి, రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థిని అఖలాబాయ్‌ని ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే బీబీఎం, ఎంబీఏ తదితర కోర్సులను తీసుకొస్తామని తెలిపారు. స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. కాగా, కళాశాలలో 500 మంది విద్యార్థినులు ఉండగా.. తరగతి గదుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఐఈఓ హృదయరాజు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.7,281

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 294 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,281, కనిష్టంగా రూ. 3,479, సరాసరి రూ. 5,775 ధరలు లభించాయి. 6 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టం రూ. 3,969, కనిష్టంగా రూ. 3,709 ధరలు పలికాయి.

పేస్కేల్‌ అమలు

చేసేదాక పోరాటం

గద్వాల న్యూటౌన్‌: వీబీ–జీ రామ్‌జీ ఉద్యోగులకు పేస్కేల్‌ అమలు చేసేదాక పోరాటం కొనసాగిస్తామని జేఏసీ కన్వీనర్‌ రాంప్రసాద్‌ అన్నా రు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన నిరసన సభలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తూ.. గ్రామీ ణ ప్రజల జీవనోపాధి మెరుగుదల, సుస్థిర ఆస్తుల కల్పనకు సేవలందిస్తున్న తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాల పోషణకు సరిపోని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు పేస్కేల్‌ అమలు చేయాలని గత ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞ ప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు పేస్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలన్నారు. సమావేశంలో జేఏసీ కోకన్వీనర్‌ శ్రీనివాసులు, శివజ్యోతి, హుస్సేన్‌, విజయశంకర్‌ ఉన్నారు.

హామీల అమలులో

కాంగ్రెస్‌ విఫలం

గద్వాలన్యూటౌన్‌: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం స్థానిక ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కా లర్‌షిప్‌లను సకాలంలో అందించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద, మద్యతరగతి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదన్నారు. పరీక్షలు రాయడంలో, తదుపరి విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బండల వెంకట్రాములు, రవికుమార్‌, శ్యాంరావు, సమతాగౌడ్‌, అనీల్‌, అక్బర్‌ బాషా, పటేల్‌, పాండు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement