● రూ.240 కోట్లతో నాలుగు
ఐటీఐలు అనుసంధానం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం..
ప్రారంభమైన టెండర్ ప్రక్రియ
వనపర్తి: సంస్థానాధీశుల కాలం నుంచే విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చే వనపర్తికి విద్యాపర్తిగా పేరొచ్చింది. తాజాగా వనపర్తి ఐటీఐని ఏఐపీ (అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్) హబ్‌గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) క్లస్టర్–8 లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది. రూ.240 కోట్లతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1953లోనే వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో సాంకేతిక విద్య, ఉన్నత విద్యకు నిలయంగా మారింది. మరోసారి రాష్ట్ర ప్రభు త్వం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవ తో వనపర్తి ఐటీఐకి గద్వాల, మహబూబ్‌నగర్ బాలికలు, డిండి, మన్ననూరు ఐటీఐలను అను సంధానం చేస్తూ ఏఐపీ హబ్‌గా ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించగా ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్ ప్రక్రి య ప్రారంభం కానుంది. దీంతో ఉన్నత విద్య తో పాటు పారిశ్రామిక విద్యలోనూ రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలవనుంది. రాష్ట్రంలోని ప్రముఖ నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో వనపర్తి ఒకటిగా మారనుంది. ఈ ప్రాజెక్టుతో వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ల్యాబ్‌లు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటో మేషన్, ఎలక్ట్రానిక్స్, ఏఐ తదితర కోర్సులు, అ ధునాతన మిషన్ల తయారీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.


