న్యూస్‌రీల్
నడిగడ్డలో ఏడు రోజుల వ్యవధిలోనే నలుగురి హత్య
● రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందం
● నిందితుల కోసం గాలింపు చర్యలు
● జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారిన ఘటనలు
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
–8లో u
నేడు మంత్రుల పర్యటన
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ధరూరు: ఉమ్మ డి జిల్లాలో సోమవారం ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.1,775.51 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ఫేజ్–1 కింద చేపట్టనున్న నాలుగు ప్యాకేజీల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో రూ.573 కోట్లతో మహబూబ్‌నగర్–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని గద్వాల– రాయచూర్ రహదారిపై రూ.339.39 కోట్లతో మహబూబ్‌నగర్–2 ప్యాకేజీ పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం వనపర్తిలోని జడ్చర్ల రోడ్డులో రూ.359.09 కోట్లతో వనపర్తి–2 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎల్లూరు వద్ద కొల్లాపూర్– మొలచింతలపల్లి మార్గంలో రూ.504.03 కోట్లతో వనపర్తి–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
రేపు సీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజ ర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. సీతారాముల కల్యాణ వేడుకను కనులారా తిలకించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
జనజాగరణ యాత్రకు
సంపూర్ణ మద్దతు
గద్వాలన్యూటౌన్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 17న చేపట్టనున్న జనజాగరణ యాత్రకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్ ఎస్‌టీయూ, టీఎన్జీఓ, తపస్, టీటీయూ, పీఆర్టీయూ, ఎస్‌జీటీయూ, టీపీఎస్‌ఏ, టీపీఆర్టీయూ, జీటీఏ, యూటీఎఫ్, బీసీటీఏ, టీపీఎస్‌ఏ, టీఎస్‌టీయూ, పీఎస్ హెచ్‌ఎం, గిరిజన ఉపాధ్యాయ సంఘం, డీటీఎఫ్ తదితర సంఘాల నాయకులను కలిసి.. 17న స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద నిర్వహించనున్న జనజాగరణ యాత్రకు మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. ఇందుకు అన్ని సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయని చెప్పారు. అనంతరం జనజాగరణ యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ నాయకులు బుచ్చన్న, నర్సింహులు, ఎల్లస్వామి, ప్రతాప్, మస్తాన్ వలీ, చంద్రశేఖర్, రాజు పాల్గొన్నారు.
గద్వాల క్రైం: నడిగడ్డలో ప్రతీకార దాడులు, వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కేవలం ఏడు రో జుల వ్యవధిలోనే నలుగురు హత్యకు గురికావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఏళ్ల తరబ డి మనసులో మొలకెత్తిన విషభీజం.. ప్రత్యర్థి చేసిన గుండెగాయానికి బదులు తీర్చుకునే క్రమంలో దారుణాలు చోటు చేసుకోవడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. వరుస హత్యలన్నీ ప్రతీకారంతోనే జరగడంతో జిల్లా పోలీసుశాఖ అప్రమత్తమైంది.
ప్రత్యేక బృందాలతో గాలింపు..
హత్యలకు పాల్పడిన నేరస్తులను పట్టుకునేందుకు పోలీసుశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. హత్యకు గల కారణాలను బాధితుల ద్వారా తెలుసుకుని ఆ దిశగా విచారణ చేపడుతోంది. క్లూస్ టీం, సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, ఫ్రింగర్ ప్రింట్స్ విభాగాలతో నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. హత్య ఘటనలో ఎవరి ప్రమేయం ఉంది.. ఎంతమంది కలిసి హత్య చేశారు.. లేక సుఫారీ గ్యాంగ్‌లతో హత్యలు చేయించారనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కేసుల ఛేదనలో విచారణ అధికారులకు సైతం కంటిమీద కునుకు లేకుండా పోతోందని తెలుస్తోంది.
● గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు శంకరమ్మ (65), అదే కాలనీకి చెందిన సమీప బంధువు (వరుసకు కుమారుడు) మధ్య ఏడాది క్రితం వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తిపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై ధ్వేషం పెంచుకు న్న సదరు వ్యక్తి.. ఈ నెల 11న మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న శంకరమ్మపై పదునైన ఆయుధంతో దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
రేపు అప్రెంటిస్‌షిప్ మేళా
కందనూలు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఈ నెల 14న వృత్తివిద్య కోర్సుల అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94929 92047 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.


