మల్దకల్/కేటీదొడ్డి/గట్టు: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలం దాసర్‌పల్లి, కేటీదొడ్డి మండలం మైలగడ్డ, గట్టు మండలం తుమ్మలచెరువు, ఆలూరు గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను మంజూరు చేయగా.. 2వేలకు పైగా నిర్మాణాలను పూర్తిచేసుకొని లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. విడతల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచులు రాజు, వెంకటేశ్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, ఉరుకుందు, చంద్రశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, రాజారెడ్డి, రమేశ్‌రెడ్డి, భరత్‌రెడ్డి, చంద్రశేఖర్, జగదీశ్వర్‌రెడ్డి, మేసీ్త్ర తిమ్మప్ప పాల్గొన్నారు.


