మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రామంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్‌లో స్థానం దక్కించుకున్నాను. – మొహిలా అలీ,
కొన్నూరు గ్రామం, మదనాపురం
శిక్షణ ఉపయోగపడింది..
గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసు కుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అగ్నివీర్‌లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది.
– రాఘవేంద్ర, ద్వారకానగర్, మదనాపురం
●


