అగ్నివీరులు..! | - | Sakshi
Sakshi News home page

అగ్నివీరులు..!

Jul 12 2026 1:29 AM | Updated on Jul 12 2026 1:29 AM

దేశ రక్షణకు యువత ముందడుగు

2025– 26లో వనపర్తి జిల్లా నుంచి 17 మంది ఎంపిక

యువతలో ఆసక్తిరేపుతున్న రిటైర్డ్‌ ఆర్మీ జవాన్ల ఉచిత శిక్షణ

2027 నోటిఫికేషన్‌ కోసం మరో 15 మందికి తర్ఫీదు

ఆర్మీలో ఏఐపీటీగా పనిచేసిన అనుభవంతో మెరుగైన శిక్షణకు అవకాశం

సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్‌ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్‌.. జై కిసాన్‌.. ఫ్రీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌’ సెంటర్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో యువతకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్‌నెస్‌ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్‌ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్‌లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్‌సింగ్‌ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్‌కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై శిక్షణ ఇస్తున్నారు.

నాటి కలెక్టర్‌ స్ఫూర్తితో..

2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్‌ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్‌ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్‌ను సిద్ధం చేసి ట్రైనింగ్‌ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ కొనసాగిస్తాం. – మహేష్‌, మాజీ సైనికుడు,

జై జవాన్‌, జై కిసాన్‌ ఫ్రీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ నిర్వాహకులు, వనపర్తి

సంస్థను ఏర్పాటు చేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement