ఫీజు తగ్గించాలి.. | - | Sakshi
Sakshi News home page

ఫీజు తగ్గించాలి..

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

గత ఐదేళ్ల నుంచి అయిజలో పశువుల సంత నిర్వహిస్తున్నారు. పశువులను కొనుగోలు చేసిన వారి నుంచి మార్కెట్‌ అధికారులు మొదట్లో ఫీజుగా గొర్రెలు, మేకలకు ఒక్కొక్క దానికి రూ.10, ఆవులు, గేదెలకు ఒక్కొక్క దానికి రూ.50 వసూలు చేశారు. కానీ, 2024 నుంచి నూటికి రూ.1 చొప్పున వసూలు చేస్తుండడంతో రైతులకు భారంగా మారింది. మార్కెట్‌ ఫీజును తగ్గిస్తే బాగుంటుంది.

– తిక్కన్న, రైతు, తొత్తినోనిదొడ్డి

వసతులు కల్పించాలి

పశువుల సంతలో అధికారులు మౌలిక వసతులు కల్పించలేదు. కనీసం పశువులకు తాగునీరు, నీడ కూడా లేదు. వర్షం కురిస్తే చెట్ల కిందకు పరుగెత్తాల్సి వస్తుంది. క్రయవిక్రయాల ద్వారా వస్తున్న ఆదాయంను మౌలిక వసతులు కల్పించేందుకు వినియోగిస్తే అభివృద్ధి జరుగుతుంది.

– లింగన్న, రైతు, అయిజ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement