తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్‌పై అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్ హెడ్‌వర్క్ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది.


