జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి పూజలు | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి పూజలు

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

అలంపూర్‌ రూరల్‌: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారికి ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన జోగుళాంబ సన్నిధిలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో పూజలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. అలాగే యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం మూడోరోజు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పీఠాధిపతి రాక తెలిసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పల్లీ క్వింటా

రూ.7,342

గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు బుధవారం 1,067 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,342, కనిష్టంగా రూ.3,129, సరాసరిగా రూ.5,899 ధరలు లభించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement