పట్టించుకోవడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోవడం లేదు..

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

జూరాల ప్రధాన ఎడమకాల్వకు వారాబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్న అధికారులు.. సమాంతర కాల్వలో ఏడాది పొడవునా నీరు వృథాగా పారుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు ముందుభాగంలో ఉన్న అమరచింత, ఆత్మకూర్‌ మండలాల రైతులకు సైతం సాగునీరు అందడం లేదు. కేవలం వరదలు వచ్చినప్పుడే నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన కాల్వ ద్వారా ఏడాది పొడవునా నీరు పారుతోంది. – భాస్కర్‌రెడ్డి, రైతు, నందిమళ్ల

మరమ్మతులు పూర్తి చేస్తాం..

సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల మర్మతులకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. ఈ వేసవిలో మరమ్మతులు పూర్తి చేయడానికి నీటిని నిలిపేందుకు రింగ్‌బండ్‌ వేశాం. అది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. త్వరగా మరమ్మతులు పూర్తిచేసి నీటివృథాకు అడ్డుకట్ట వేస్తాం. – కేశవరావు, ఈఈ, భీమా ఫేజ్‌–2

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement