గద్వాల క్రైం: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పలు శా ఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యాపార సముదాయాలు, పంట పొలాలు, హోట ళ్లు, మెకానిక్ షాపులు తదితర వాటిలో పనిచేస్తున్న బాలలను గుర్తించి.. పాఠశాలల్లో చేర్పించాలన్నా రు. ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆపరేషన్ ముస్కాన్–14 ద్వారా బాలకార్మికులతో పాటు నిరాశ్రయులైన పిల్లలు, భిక్షాటనలో బంధిలైన వారిని రక్షించి.. పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతామన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, వివిధ శాఖల అధికారులు సహదేవుడు, నర్సింహానాయుడు, రాజు, శివలీల ఉన్నారు.


