నేను గుడిసెలో నివాసముంటున్నా. వానాకాలంలో వ ర్షానికి గుడిసె మొత్తం తడిసిపోతుంది. ఇదివరకే పెద్ద గాలివానాలకు రెండుసార్లు గుడిసె కప్పు కొట్టుకుపోయింది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాలేదు.
– బి.నర్సన్న, బస్వాపురం, ఉండవెల్లి మండలం
లేని కారు ఉన్నట్టు చూపారు..
నాకు ఎలాంటి కారు కానీ నాలుగు చక్రాల వాహనం కాని లేదు. నేను ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. అయితే నాకు కారు ఉందనే కారణం చూపెడుతూ నన్ను లిస్ట్–3లో అనర్హత జాబితాలో చేర్చారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసి విన్నవించా. కానీ సమస్య పరిష్కారం కాలేదు. లేని కారు ఉన్నట్టు చూపెట్టడంతో నాకు అన్యాయం జరిగింది. దీనిపై విచారణ జరిపి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– జకరయ్య, పైపాడు, వడ్డేపల్లి మున్సిపాలిటీ


