నాకు బోయలగూడెం శివారులోని సర్వేనంబర్ 533/1లో 1.20 ఎకరాల భూమిని నా భర్త వీరేష్‌గౌడ్ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే నాకు తెలియకుండా నా కొడుకులు అక్రమంగా వారి పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్లీ వారి బావమరదుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై అడిగితే నాపై దాడిచేశారు. దీనిపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి.
– వెంకటేశ్వర్మ, బోయలగూడెం, గట్టు మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి..
నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల అనారోగ్యంతో నా భర్త మరణించారు. దీంతో నా ఇద్దరు పిల్లల పోషణ భారంగా మారింది. నేను ఎంఏ, బీఈడీ చేశాను. ప్రభుత్వం స్పందించి ఆదుకుంటే కుటుంబాన్ని పోషించుకుంటాను.
– సుజాత, గద్వాల


