హిందూ సమాజం ఏకం కావాలి | - | Sakshi
Sakshi News home page

హిందూ సమాజం ఏకం కావాలి

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

గద్వాలన్యూటౌన్‌: హిందూ సమాజం ఏకమై సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించాలని తెలంగాణ సాదు పరిషత్‌ అద్యక్షుడు శంకర్‌ స్వామీజీ సూచించారు. ఆదివారం స్థానిక జములమ్మ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ సాదు పరిషత్‌ ఆధ్వర్యంలో మహాజన శక్తి కార్యక్రమం నిర్వహించగా.. పలువురు సాధువులు, హిందూ సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధార్మిక విలువలు, సామాజిక ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందన్నారు. హిందూ దేవాలయాల్లో దర్శ నం చేసుకునే హక్కు భక్తులందరికీ ఉందన్నారు. ఇటీవల మల్దకల్‌ మండలం మద్దెలబండలో పోలీసులు త నను నిర్బంధించిన ఘటనపై అధికారులు చట్టబద్ధంగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్నారు. జముల మ్మ అమ్మవారిపై భక్తుల కు ఉన్న విశ్వాసాలను గౌరవించాలన్నారు. ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించాలని సూచించారు. అంతకుమందు శంకర్‌ స్వామీజీ, ఇతర సాధువులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురందర్‌ కుమార్‌, వేదయోగి మహారాజ్‌, ఆత్మ రామస్వామి, సీవీఆర్‌ ప్రసాద్‌, డా.పురుషోత్తం, కీర లింగేశ్వరస్వామి, ప్రియా చౌదరి, స్థానిక వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement