గద్వాల క్రైం: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలి యో చుక్కలు వేయించి.. జోగుళాంబ గద్వా లను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామ ని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి.. పిల్లలకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ఐదేళ్లలోపు వయసు కలిగిన 69,383 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందన్నారు. పల్స్‌పోలియోను విజయవంతంగా నిర్వహించేందుకు 1,884 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు చుక్కల మందు వేస్తారని.. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


