అలంపూర్ రూరల్: రెండు చుక్కల పోలియో మందు చిన్నారుల నిండు జీవితాన్ని నిలుపుతుందని.. ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. జాతీయ పల్స్‌పోలియో సందర్భంగా ఆదివారం అలంపూర్‌లో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసూనరాణి, మండల వైద్యాధికారిణి రాధిక ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యసిబ్బంది గుర్తించిన ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. కాగా, అలంపూర్ మున్సిపాలిటీ, మండలంలో 95శాతం చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.


