ఆశావహులకు చుక్కెదురు | - | Sakshi
Sakshi News home page

ఆశావహులకు చుక్కెదురు

Jan 19 2026 6:23 AM | Updated on Jan 19 2026 6:23 AM

ఆశావహులకు చుక్కెదురు

ఆశావహులకు చుక్కెదురు

మరికొందరికి అనుకూలం..

తాజా రిజర్వేషన్లు మరికొంత మందికి అనుకూలంగా ఉన్నాయి. జనరల్‌, బీసీ జనరల్‌కు రిజర్వు అయిన వార్డులలో మాజీలకు ఇప్పుడు మరోసారి అవకాశం ఉంది. దీంతో వారంతా ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. 3, 7, 13, 17, 19, 20, 21, 26, 28, 35వ వార్డులు కొంతమందికి అనుకూలంగా మారాయి. కొన్ని మినహా మిగిలిన వార్డులు గతంలో మాదిరిగానే మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాంటి వార్డులలో గతంలో బరిలో దిగిన వారే మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. కొన్ని వార్డులలో మాత్రమే నాయకులకు కొంత ఇబ్బందిగా మారింది. 16, 18, 22, 32, 34వ వార్డులలో వారి సతీమణులు, కుటుంబ సభ్యులను పోటీలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

గద్వాల టౌన్‌: మున్సిపాలిటీలో మారిన రిజర్వేషన్లతో కొంతమంది ఔత్సాహికులు నిరుత్సాహానికి గురయ్యారు. తాజామాజీలకు కూడా భంగపాటు ఎదురైంది. ఎప్పటి నుంచో కౌన్సిలర్‌ పదవులపై ఆశలు పెంచుకున్న వారి ఆశలపై రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఐదేళ్లపాటు పదవులు అనుభవించిన కొంతమంది మాజీలకు ఇప్పుడు పోటీ చేసేందుకు రిజర్వేషన్లు అడ్డువచ్చాయి. దీంతో తెరచాటు రాజకీయా లకు పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అంచనాలు తారుమారు..

గద్వాల మున్సిపాలిటీలో 1, 4, 6, 31 వార్డులు ఎస్సీలకు, 27వ వార్డు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేయాలనుకున్న తాజా మాజీలతోపాటు ఔత్సాహికులకు చుక్కెదురైనట్లు అయ్యింది. ఇది ‘మా తలరాత’ అంటూ కొంతమంది పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంచనాలు మారడంతో మరికొందరు పక్క వార్డులలో పోటీ చేయడానికి సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది. జనరల్‌ స్థానాలైన 4, 5, 30, 36వ వార్డులలో ఇతరులు పోటీ చేయడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఇతర వార్డులలో పోటీ చేస్తే అక్కడి స్థానిక మాజీలు, ఆశావహులతో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా ఉన్న తమను కాదని ఇతర వార్డులకు చెందిన నాయకులను పోటీకి దించితే తమ సత్తా చాటుతామని ఇప్పటికే సొంత పార్టీల నాయకులే హెచ్చరిస్తుండటం విశేషం. ఒకవేళ సాహసం చేసి ఇతర వార్డులలో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనే లెక్కలు వేసుకుంటూనే భయంతో జంకుతున్నారు.

బలమైన నాయకులేరి?

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయిన వార్డులలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన బలమైన నాయకులు కనిపించడం లేదు. దీంతో ఇతర వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు, నాయకులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది మాజీ కౌన్సిలర్లు ఇప్పటికే ఒక దఫా వార్డులలో పర్యటించి.. తామే ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నామని పరిచయం చేసుకున్నారు. అయితే ఓటర్ల నుంచి సరైన స్పందన రాకపోవడంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎస్సీ ఓటర్లు బలంగా ఉన్న వార్డులు జనరల్‌, బీసీలకు రిజర్వు అయ్యాయి. ఇలా జనరల్‌ అయిన 5, 14వ వార్డులలో ఎస్సీలే పోటీ చేయడానికి సిద్ధమవుతుండగా.. ఇక్కడ ఇతర వర్గాలు పోటీ చేయడానికి జంకుతున్నారు.

రిజర్వేషన్ల తకరారుతో

మారిన నాయకుల తలరాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement