వైభవంగా ఆరాధనోత్సవాలు
మల్దకల్: ఆదిశిలాక్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పురంధరదాసుల ఆరాధనోత్సవాలు వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు దీరేంద్రదాసు, మధుసూదనాచారి, రవిచారి, శ్రావణ్ పురంధరదాసుల విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్వామివారి ఉత్సవమూర్తితో రథోత్సవం నిర్వహించారు. అలాగే వేంకటేశ్వరస్వామి హరికథను ఆంజనేయులు భాగవతార్ వినిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, బాబురావు, దీరేంద్రదాసు, చంద్రశేఖర్‌రావు, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి, నరేందర్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభలకు తరలిరండి
గట్టు: హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఈ నెల 25 నుంచి 28 వరకు ఐద్వా జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి నర్మద అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐద్వా 14వ జాతీయ మహాసభలకు సంబంధించి వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కుల సాధనకు నిరంతరం కృషిచేస్తూ దేశవ్యాప్త నిర్మాణం ఉన్న ఐద్వా ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్ వద్ద నిర్వహించే మహాసభలకు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పుణ్యవతి, సుధాసుందర్, మల్లు లక్ష్మి, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ధూప, దీప, నైవేద్య పథకంపై దుష్ప్రచారం మానుకోవాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ధూప, దీప నైవేద్య పథకం, అర్చక సంఘంపై చేస్తున్న దుష్ప్ర చారం మానుకోవాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జి.రవికుమార్, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జంగం మహేష్, కుమారస్వామి తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు అర్చకులు పెద్ద మనుషులుగా ప్రచారం చేసుకుంటూ, వారి ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తూ పెత్తనం చేయాలనుకుంటున్నారని అన్నారు. ధూప, దీప నైవేద్య అర్చక సంఘంపై, అధ్యక్ష, కార్యవర్గంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. తెలంగాణ క్షేమం కోసం ధూప, దీప నైవేద్య అర్చకుల సహకారంతో ప్రతి ఏడాది సంఘం ద్వారా యజ్ఞ, యాగాది, క్రతువులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయ వ్యవస్థను కాపాడటం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డీడీఎన్ అర్చకులకు ఉద్యోగ భద్రత, వేతన పెంపుదల చేస్తుందనే విశ్వాసం ఉందన్నారు.
వైభవంగా ఆరాధనోత్సవాలు


