కొద్దిరోజుల్లో ఏర్పాటు చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

కొద్దిరోజుల్లో ఏర్పాటు చేస్తాం..

Jan 19 2026 6:23 AM | Updated on Jan 19 2026 6:23 AM

కొద్ద

కొద్దిరోజుల్లో ఏర్పాటు చేస్తాం..

కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం. గద్వాల, అయిజలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. వీలైనంత త్వరగా కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

– చంద్రమౌళి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌

ఈసారి కూడా నష్టమే..

గడిచిన రెండేళ్లుగా కంది పంటతో లాభం రాలేదు. ఈసారి నాలుగు ఎకరాల్లో వేశాను. 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. రూ.వేలకు వేలు పెట్టుబడులు అయితే.. క్వింటాల్‌కు రూ.6,500 మాత్రమే రావడంతో నష్టపోవాల్సి వచ్చింది.

– హన్మంతు, కందిరైతు, గద్వాల

ధరలు పెద్దగా రాలేవు..

ఎనిమిది ఎకరాల్లో కంది పంట వేశాను. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక విపరీతంగా తెగుళ్లు వచ్చాయి. పురుగు మందులకు చాలా ఖర్చు అయ్యింది. కంది ధరలు కూడా పెద్దగా రాలేదు. క్వింటాల్‌ రూ.8వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుంది. – చిన్న మద్దిలేటి,

రైతు, చెన్నిపాడు, మానవపాడు మండలం

కొద్దిరోజుల్లో ఏర్పాటు చేస్తాం.. 1
1/1

కొద్దిరోజుల్లో ఏర్పాటు చేస్తాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement