కేంద్రం నుంచి పూర్తి సహకారం..
పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఎలాంటి కృషి చేయలేదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.పాలమూరు అభివృద్ధి దిశగా పయనించేందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై గురుతర బాధ్యత ఉందన్నారు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. కేంద్ర, రాష్ట్ర వాటా నిధులతో వివిధ పథకాల పూర్తికి కృషి చేస్తామన్నారు.విద్యపరంగా పీయూ అభివృద్ధికి రూ.120 కోట్లు ఇచ్చామన్నారు. పాలమూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వెంటనే బాగు చేయించాలని కోరారు.


