జోగుళాంబ వార్షికోత్సవం.. కలెక్టర్‌కు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ వార్షికోత్సవం.. కలెక్టర్‌కు ఆహ్వానం

Jan 18 2026 7:05 AM | Updated on Jan 18 2026 7:05 AM

జోగుళ

జోగుళాంబ వార్షికోత్సవం.. కలెక్టర్‌కు ఆహ్వానం

అలంపూర్‌: జోగుళాంబ అమ్మవారి వార్శిక బ్రహ్మోత్సవాలకు కలెక్టన్‌ సంతోష్‌ను ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో ఆయనను కలిసి వార్శిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశామన్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ అమ్మవారి వార్శిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. అలాగే బాలబ్రహ్మేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహిస్తామన్నారు.

ఆలయాల్లో ముగిసిన శుద్ధి

అమ్మవారి వార్శికోత్సవంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని, అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. సాయంత్రం శుద్ధి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. యథాతథంగా దర్శనాలకు అనుమతించారు.

జోగుళాంబ వార్షికోత్సవం.. కలెక్టర్‌కు ఆహ్వానం 
1
1/1

జోగుళాంబ వార్షికోత్సవం.. కలెక్టర్‌కు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement