జోగుళాంబ గద్వాల
ఆకట్టుకున్న పోటీలు
సుఖ సంతోషాల సంబురం
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ఊర్కొండపేట అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమై
ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి.
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026
–IIలో u
గద్వాలటౌన్/మల్దకల్: మకరజ్యోతి వెలుగులు.. ధాన్యలక్ష్మి సిరిసంపదలు.. రంగవల్లుల గొబ్బెమ్మలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలతో జిల్లావ్యాప్తంగా గురువారం సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందం జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ అన్ని కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఇంటి ముంగిళ్లు రంగవల్లులతో మెరిసి పోయాయి. సంక్రాంతి ప్రాధాన్యతను చాటే ముత్యాల ముగ్గులు ముచ్చటగొలిపాయి. మూడు రోజుల పండగలో భాగంగా బుధవారం భోగితో ప్రారంభమైన వేడుకలు శుక్రవారం కనుమతో ముగిసాయి. సాంప్రదాయం వంటకాలు మొదటిరోజు సజ్జ, నువ్వులరొట్టెలు, తోడుగా రుచికరమైన కలగూరలు, గురువారం మకర సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లం మిశ్రమంతో పరమాన్నం, ప్రత్యేక పిండి వంటలు చేసుకున్నా రు. శుక్రవారం కనుమ పండుగను పురస్కరించుకొ ని కొంతమంది మాంసాహారాలతో రుచికరమైన వంటలు ఆరగించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పిలిగుండ్ల కాలనీ, రాఘవేంద్ర వీవర్స్ కాలనీ, అట్కార్‌పేట కాలనీలో గద్వాల చేనేత జరీ చీరల ప్రత్యేకతను చాటుతూ పలువురు ఇళ్ల ఆవరణలో ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. పండుగను పురస్కరించుకొని పలువురు ఇళ్లల్లో చిన్నారులపై రేగిపండ్లు వేసి ఆశీర్వదించారు
కురువ డోలు పోటీలు
మల్దకల్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచు చిట్టెమ్మ ఆధ్వర్యంలో బీరప్ప సంఘం నిర్వాహుకులు కురువ డోలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి 16 మంది పోటీదారులు పాల్గొన్నారు. వారిలో ప్రథమ బహుమతిని ఉప్పల గ్రామానికి చెందిన పరశురాములు గెలుపొందగా రూ.5,016, రెండో బహుమతి గుడ్డెందొడ్డికి చెందిన గోపాల్‌కు రూ.4,016, అదే గ్రామానికి చెందిన వెంకటేష్ మూడో బహుమతి రూ.3,016, సజ్జాపురం గ్రామానికి చెందిన మల్లేష్ నాల్గో బహుమతి రూ.2,016, అదే గ్రామానికి చెందిన భీమన్నలు ఐదో బహుమతిగా రూ.1,016లను అందుకున్నారు.
బండలాగుడు పోటీలో బల ప్రదర్శన చూపుతున్న వృషభాలు
మల్దకల్‌లో కురువ డోలు పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులు
పండుగను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో వివిధ క్రీడాపోటలు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడల్లో ప్రతిభ చాటిన జట్లకు నగదు బహుమతులతో పాటు షీల్డ్‌లను అందించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆలయాల ఆవరణలో నిర్వహించిన బండలాగుడు పోటీలు, సందెపు రాళ్ల పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి.
జోగుళాంబ గద్వాల
జోగుళాంబ గద్వాల


