ఆలయ గ్రంథం ఆవిష్కరణ
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయ చరిత్ర గ్రంథాన్ని తెలుగు అధ్యాపకుడు బోరవెల్లి పవన్‌కుమార్ రచించగా.. రాజవంశీయుడు లక్ష్మీకేశవరెడ్డి ఆవిష్కరించారు. బుధవారం వేణుగోపాలస్వామి ఆలయంలో గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవంతో పాటు ఆలయ చరిత్ర గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీకేశవరెడ్డి మాట్లాడుతూ.. వేణుగోపాలస్వామి ఆలయ చరిత్ర గ్రంథ రూపంలో రచించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ విశిష్టత, శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని గ్రంథంలో విపులంగా వివరించారని చెప్పారు. కార్యక్రమంలో డా.బాలస్వామి, రామ్మోహన్‌రావు, వారణాసి నాగేశ్వరాచారి, గోవర్ధన్‌శెట్టి, నందకిషోర్, లక్ష్మణ్, వగ్గు నాగరాజు, గోసాయి వేణు, భానుప్రకాశ్, మహేందర్, జయన్న, బసవరాజ్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.


