ఆదరణ తగ్గింది
మా గ్రామం చర్లపల్లి అయినా పెద్దలనుంచి వచ్చిన గంగిరెద్దులను ఆడించటం కోసం సంచార జీవనం గడుపుతున్నా. భార్య ఇద్దరు పిల్లలతో గంగాపూర్‌లో గుడారాలు వేసుకొని జీవిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇదే వృత్తిలో ఊరూరా తిరుగుతుంటాను. ఏడాదిలో ఈ మూడు రోజులే జడ్చర్లలో తిరిగి యాచకం చేస్తా. ఇంతకుముందు అయితే ధనం, ధాన్యం, గడ్డి అన్ని దానం చేసేవారు. ఇప్పుడు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది.
– రాములు, గంగిరెద్దులను ఆడించే వ్యక్తి
ఎద్దులే సాకుతాయి..
ఎద్దులను మంచిగా చూసుకుంటే అవి మా కుటుంబాలను సాకుతున్నాయి. వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుతున్నాం. ఎద్దులు మంచిగా ఉంటేనే మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మారుతున్న సమాజంతో పొటీ పడేలా మాకు ప్రత్యేకమైన సదుపాయలు కల్పిస్తే మానుగడ సాగిస్తాం. తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించేలా నెట్టుకొస్తున్నాం.
– రాములు, నవాబుపేట
ఆదరణ తగ్గింది


