యువత చూపు.. మోదీ వైపు
గద్వాలన్యూటౌన్: ప్రపంచంలోనే భారతదేశాన్ని బలమైన శక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీ వైపు యువత చూస్తోందని బీజేపీ జిల్లా అద్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని 8వ వార్డు యువకులు డీకే బంగ్లాలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 37 వార్డుల్లో పోటీచేస్తుందని తెలిపారు. ఎంపీ డీకే అరుణ, స్నిగ్దారెడ్డిల నాయకత్వంలో గద్వాలలో బీజేపీ బలపడుతోందని అన్నారు. మున్సిపాలీటీలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎక్బోటే, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్, రజక నర్సింహులు పాల్గొన్నారు.
పెన్షనర్ల సమస్యల
పరిష్కారానికి కృషి
అలంపూర్: పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి అన్నారు. అలంపూర్‌లోని వాసవీ కాన్యకా పరమేశ్వరిదేవి నిత్యన్నదాన సత్రంలో బుధవారం పెన్షనర్స్ యూనియన్, జేఏసీ, ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్యశెట్టి మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన పెన్షనర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. రాష్ట్ర, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల సహకారంతో అలంపూర్‌లో పెన్షనర్ల భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నిర్మలమ్మ, కృష్ణమూర్తి, మద్దిలేటి, కేశవాచారి, వెంకటస్వామి, సలీం, జమ్మన్న, శ్రీనివాసులు, రమేశ్‌గుప్తా, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు
ఆహ్వానం
అలంపూర్: జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని బుధవారం నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, ధార్మిక సలహాదారు గోవింద హరిని ఆహ్వానించినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
యువత చూపు.. మోదీ వైపు
యువత చూపు.. మోదీ వైపు


