మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
గద్వాలన్యూటౌన్: మున్సిల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు.. తుది ఓటరు జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేశారు.
● గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులకు గాను ఎస్టీ జనరల్‌కు 1, ఎస్సీలకు 4 వార్డులు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రకారం బీసీలకు 13 వార్డులు దక్కనున్నాయి. ఇందులో 7 వార్డులు బీసీ జనరల్‌కు, 6 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. 19 వార్డులను జనరల్‌కు కేటాయించగా.. 10 వార్డులు జనరల్ మహిళ, 9 వార్డులు జనరల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
● అయిజలో 20 వార్డులు ఉండగా.. ఎస్టీ జనరల్‌కు 1 రిజర్వు చేశారు. ఎస్సీలకు 5 వార్డులకు గాను ఎస్సీ జనరల్‌కు 3, ఎస్సీ మహిళకు 2 కేటాయించారు. బీసీలకు 4 వార్డులు రిజర్వు కాగా.. 2 వార్డులు బీసీ జనరల్, 2 వార్డులు బీసీ మహిళలకు దక్కనున్నాయి. 10 వార్డులు జనరల్‌కు రిజర్వు కాగా.. ఇందులో 6 వార్డులు జనరల్ మహిళ, 4 వార్డులు జనరల్‌కు కేటాయించచారు.
● అలంపూర్‌లో 10 వార్డులు ఉండగా.. ఎస్టీ జనరల్‌కు 1 రిజర్వు చేశారు. 2 వార్డులు ఎస్సీలకు, 2 వార్డులు బీసీలకు కేటాయించారు. 3 జనరల్‌కు రిజర్వు చేయగా.. 1 మహిళకు, 2 జనరల్‌కు కేటాయించారు.
● వడ్డేపల్లిలో 10 వార్డులకు గాను 1 ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఎస్సీలకు 2, బీసీలకు 2 వార్డులు రిజర్వు చేశారు. 3 వార్డులు జనరల్‌కు రిజర్వు కాగా.. 1 మహిళకు, 2 జనరల్ స్థానాలుగా ఖరారు చేశారు.


