జాతీయస్థాయిలో సత్తాచాటిన దివ్యాంగ విద్యార్థులు
ఆత్మకూర్: గోల్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ఆత్మకూర్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థులు సత్తాచాటి మొదటి బహుమతి సాధించారు. ఈ నెల 10 నుంచి బిహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 5వ నేషనల్ గోల్‌బాల్ పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ క్రమంలో ఆత్మకూర్ సమ్మిలిత ఫౌండేషన్‌కు చెందిన విద్యార్థి పవన్‌కల్యాణ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా ఇక్కడి దివ్యాంగ విద్యార్థులు రాజేష్, వేణు, కిరణ్, మధు, సాయిరాంవర్మ ప్రతిభ కనబర్చి ఫైనల్‌లో ఏపీ జట్టుపై విజయం సాధించారని కోచ్, సంస్థ డైరెక్టర్ శివకుమార్ తెలిపారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్థిక సహకారంతోనే తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.


