పిండి వంటల ఘుమఘుమలు..
మహిళలందరూ ఒక చోట చేరి పిండి వంటలు చేసుకోవడం పండగ ప్రత్యేకత. సకినాలు, అరిసెలు, కారపూసలు, జంతికలు, నువ్వుల ఉండలు, గారెలు చేస్తుంటారు. ఇప్పటికే గ్రామాల్లో పిండి వంటలు తయారీ పూర్తయింది. ఉద్యోగాలు, చదువుల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఉన్న వారంతా పండగకు ఇంటికి వచ్చా రు. విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులు పట్నం నుంచి పల్లెబాట పట్టారు. అయితే నడిగడ్డకు చెందిన చాలా మంది యువకులు ఆంధ్రపదేశ్‌లోని గోదావరి తీరంలో సంక్రాంతి పండగ వేడుకలను ఆస్వాదించడానికి పయనమయ్యారు.


