సరదాల సంక్రాంతి
వేళ పిండివంటల ఘుమఘుమలు.. పతంగుల కోలాహలం.. ముంగిట్లో ముత్యాల ముగ్గులు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. మహిళలు నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముచ్చటైన తెలుగు పండగ సంక్రాంతిని మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం భోగభాగ్యాల భోగి, గురువారం సంకాంత్రి, శుక్రవారం
కనుమను కుటుంబ సమేతంగా నిర్వహించుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారు
సొంతూళ్లకు చేరుకున్నారు. ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దేందుకు యువతులు, మహిళలు సన్నద్ధమవుతున్నారు. మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం.. పంట ఇంటికొచ్చే వేళ ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. – గద్వాలటౌన్
సరదాల సంక్రాంతి
సంక్రాంతి అంటేనే సంబురం. ఈ పర్వదినానికి పల్లెల్లో ఎనలేని ప్రాధా న్యం ఉంటుంది. గ్రామాల్లో అన్ని వర్గాలకు వ్యవసాయమే మూలాధారం. ఏటా వానాకాలం పంటలు చేతికొచ్చే సందర్భంలో చేసుకునే వేడుకే ఇది. అందుకే పంటలకు, పండగకూ విడదీయలేని సంబంధం. అయితే ఈ సారి మాత్రం జిల్లాలోని పల్లెల్లో వానాకాలం పంటలు చేతికి రావడంతో పాటు యాసంగి కలిసొచ్చిన సందర్భం తోడవుతూ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. రైతుల నాగళ్ల చప్పుళ్లతో పొలాలన్నీ సందడిగా మారాయి. వరితో పాటు జొన్న, కంది, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు సాగవుతున్నాయి. ఈ తరుణంలో సంకాంత్రి పండగ గ్రామీణులకు ప్రత్యేకంగా నిలిచింది.
సంక్రాంతి పర్వదినానికి ముందుగానే ముగ్గుల సందడి మొదలైంది. సూర్యోదయానికి ముందే మహిళలు లేచి ఇంటి ముందు అలుకు చల్లి ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీ పడతారు. సృజనాత్మకతకు రంగవల్లులనే వేదికగా చేసుకుంటారు. ఇందుకు అవసరమైన రంగుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వారం రోజుల నుంచే రంగుల కొనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నాయకులు, పాఠశాలల్లో వేర్వేరుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్సాహపరుస్తున్నారు.
ముత్యాల ముగ్గులు ప్రత్యేకం..
జిల్లాలో మొదలైన పండగ సందడి
నేడు భోగభాగ్యాల భోగి
రేపు సంక్రాంతి.. ఎల్లుడి కనుమ
పల్లెల్లో పండగ కోలాహలం
సరదాల సంక్రాంతి


