చింతలకుంటవాస.. శ్రీఆంజనేయ
● నేటినుంచి స్వామివారి ఉత్సవాలు
● ఇక్కడ మాంసం, కల్లుతోనే నైవేద్యం
● కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి
మొక్కుల చెల్లింపు
వనపర్తి రూరల్: ఆంజనేయస్వామికి సింధూరం, తమల పాకులు, టెంకాయలతో పూజలు నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని పాతపల్లి శివారులో వెలసిన చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, కల్లుతో నైవేద్యం సమర్పిస్తారు. ఏకంగా స్వామివారి ఎదుటే పొట్టేళ్లు, కోళ్లు బలిస్తారు. ప్రతిఏటా సంక్రాంతి పండుగ నుంచి మూడురోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు స్థానికులేగాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారికి అపారమైన శక్తి ఉందని.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాగా.. బుధవారం ప్రారంభమయ్యే ఉత్సవాలు శుక్రవారం ముగుస్తాయి. ఉత్సవాలను పురస్కరించుకొని తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు ఇతర ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పెబ్బేరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
చింతలకుంటవాస.. శ్రీఆంజనేయ


