ఫార్మర్ రిజిస్ట్రీతోనే పథకాలు
ఎర్రవల్లి: ప్రభుత్వ పథకాలను పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపురం, పుటాన్‌దొడ్డి, కొండేరు, ధర్మవరం గ్రామాల్లో ఏఈఓలు నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ యూనిక్ ఐడీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టిందన్నారు. ఫార్మర్ ఐడీతో వ్యవసాయ ఉత్పత్తులను సరైన ధరలకు విక్రయించడంతో పాటు ప్రభుత్వం అందించే ఎన్నో సేవలను సులభంగా పొందవచ్చన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ కోసం రైతులు ఆధార్, బ్యాంక్ ఖాతా, భూమి పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌తో లింక్ ఉన్న మొబైల్ నంబర్‌తో స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు. అదే విధంగా అందుబాటులో ఉన్న మీసేవ లేదా సీఎస్‌సీ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం కోదండాపురంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏఓ సురేశ్‌గౌడ్, ఏఈఓలు నరేశ్, ప్రవళిక, హిమబిందు, జెన్నిఫర్, సురేశ్, వేదావతి పాల్గొన్నారు.


