ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి
అయిజ: రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఏడీఈ నీలి గోవిందుతో కలిసి మండల కేంద్రంలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున గ్రీటింగ్ కార్డులను అందజేశారు. అనంతరం సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్‌శాఖ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ, నోట్‌బుక్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు గాను అయిజ సబ్‌స్టేషన్‌లో 33 కేవీ ప్రత్యామ్నాయ పరికరాలను అమర్చుతున్నట్లు తెలిపారు. విద్యుత్‌శాఖ ప్రజాబాట కార్యక్రమం కొనసాగిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


