వివేకానందుడి స్ఫూర్తితో ఎదగాలి
గద్వాలటౌన్: యుక్త వయసులోనే దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుడని.. ఆయన స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌మార్గ్ రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా.. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత తన క్యాంపు కార్యాలయంలో వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. వీహెచ్‌పీ నాయకులు కోటలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో బీజేపీ నా యకులు రామాంజనేయులు, జయశ్రీ,, రవికుమా ర్, రమాదేవి, సమత, అనిల్, భారతి పాల్గొన్నారు.


