సంక్షేమ పథకాలతో చేయూత
అలంపూర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదలకు చేయూత అందిస్తామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. కర్నూలులోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే విజయుడు ఆదివారం అందజేశారు. అలంపూర్ మండలం భీమవరానికి చెందిన జయంద్రకు రూ.10 వేల చెక్కు మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసిన నాయకులు:
క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడును కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిక పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.


