సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం..
ముందుండి.. రక్తదానం
నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
సామాజిక సేవలో తరిస్తున్న యువతరం
రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం
సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం
స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు..
నేడు జాతీయ యువజన దినోత్సవం
సేవాతత్పరులు


