అలంపూర్ ఆలయాల బ్రహోత్సవాలకు ఆహ్వానం
అలంపూర్: దక్షిణకాశీలో జరిగే వార్శిక బ్రహోత్సవాలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించారు. కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడులను అలంపూర్ క్షేత్ర ఆలయాల ఈఓ దీప్తి అర్చకులతోపాటు శనివారం కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలంపూర్ క్షేత్రంలో జరిగే జోగుళాంబ అమ్మవారి వార్శిక బ్రహోత్సవాలకు, బాలబ్రహ్మేశ్వరస్వామి మహా శివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసినట్లు పేర్కొన్నారు. అమ్మవారి వార్శిక బ్రహోత్సవాలు ఈ నెల 19 నుంచి 23 వరకు, స్వామివారి మహాశివరాత్రి మహోత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జరగనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి బ్రహ్మయ్యఆచారి, అర్చకులు జానకిరామశర్మ, త్యాగరాజుస్వామి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సభ ఏర్పాట్ల
పరిశీలన
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఈనెల 12వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంబీసీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానిస్తారని పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు, మున్నూరురాజు, ప్రభాకర్, వర్ధభాస్కర్, కిషన్, రమేష్, సత్తి, తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్ ఆలయాల బ్రహోత్సవాలకు ఆహ్వానం


