బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు
అలంపూర్: బాల్య వివాహాలు బాలల భవిష్యత్ అధంకారంలోకి నెడతాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించొద్దని సీడీపీఓ సుజాత, డీసీపీఓ నరసింహ అన్నారు. వడ్డేపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో మహిళాభివృద్ధి, శివు సంక్షేమ శాఖ బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ సుజాత మాట్లాడుతూ.. ఏదైనా పెళ్లి సమాచారం తెలిసినప్పుడు సర్వీస్ ప్రొవైడర్లు, పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్స్, టెంట్ హౌస్, ప్రింటింగ్ ప్రెస్ వారు వధూవరుల వయస్సును ధృవీకరించుకోవాలని సూచించారు. ఒకవేళ వారి వయస్సు ధృవీకరించుకోకపోతే బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిగా శిక్షార్హులవుతారని తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే రూ.లక్ష జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. పిల్లలకు ఏ సమస్య ఉన్నా 100, 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఐసీపీఎస్ మండల ఇన్‌చార్జులు లక్ష్మీదేవి, ప్రకాష్, సూపర్‌వైజర్లు పుష్ప, లక్ష్మీదేవి, ఏపీఎం ఎల్లప్ప, ఎంఈఓ నర్సింహులు, హబ్ సిబ్బంది చిట్టెమ్మ, సరోజ, నాగరాజు తదితరులు ఉన్నారు.
హుండీ ఆదాయం రూ.29,42,618
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ.29,42,618 వచ్చినట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ పర్యవేక్షణలో 200 మంది ఎస్‌వీఎస్ సేవాసంఘం సభ్యులు హుండీ లెక్కింపు నిర్వహించారు. అదే విధంగా చింతలముని నల్లారెడ్డి స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,32,406 వచ్చినట్లు ఆయన తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది ఆలయ హుండీ ఆదాయం పెరిగిందన్నారు. అనంతరం సేవాసమితి సభ్యులను ఆలయ చైర్మన్, ఈఓలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచు చిట్టెమ్మ, ఆలయ నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, బాబురావు, నాయకులు సీతారామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నరేందర్, నారాయణ, పద్మారెడ్డి, వీరారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో మేథోశక్తిని పెంపొందించాలి
గద్వాలటౌన్: ఆంగ్లభాషలో ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు స్పెల్లింగ్‌పై అవగాహన కల్పించేందుకు ‘ఎల్టా’ నిర్వహించిన ఒలింపియాడ్, ఉపన్యాస పోటీల కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. శుక్రవారం స్థానిక బాలభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆంగ్ల భాషోపాధ్యాయ సంఘం (ఎల్టా) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆంగ్లభాషా నైపుణ్యంపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో పాటు ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు ఆయా విభాగాల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓలు శ్రీనివాస్‌గౌడ్, సురేష్ బహుమతుల ప్రదానం చేశారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎల్టా అధ్యక్షుడు మైఖేల్, ప్రధాన కార్యదర్శి సుమలత, కోశాధికారి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
వివేకానందుడి
స్ఫూర్తితో ఎదగాలి
గద్వాలటౌన్: యుక్త వయస్సులోనే భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుడని, ఆయన స్ఫూర్తితో యువకులు ముందుకు సాగాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ కలందర్‌బాషా పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ముందస్తుగా శుక్రవారం స్థానిక కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు


