బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
అలంపూర్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్–12 నిర్వహిస్తున్నట్లు సహాయ కార్మిక అధికారి వేణుగోపాల్, జిల్లా బాలల సంరక్షణ కౌన్సిలర్ సురేష్ పేర్కొన్నారు. అలంపూర్ పట్టణంలోని కిరాణాలు, పంట పొలాలు, బైక్ మెకానిక్ షాపులు, హోటళ్లలో వారు శుక్రవారం తనిఖీ చేశారు. వివిధ పనుల్లో 18 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు పనిచేస్తున్నట్లు గుర్తించారు. 14 ఏళ్ల లోపు ఇద్దరు కూల్‌డ్రింక్ షాప్‌లో పని చేస్తున్నట్లు తెలిపారు. యజమానిపై అలంపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చారు. కార్యక్రమలో కానిస్టేబుల్ భరత్, శిల్ప, చైల్డ్ లైన్ సిబ్బంది లక్ష్మి తదితరులు ఉన్నారు.


