పునఃపరిశీలన
సవరణలకు కసరత్తు
మార్పులు, చేర్పులపై ఆసక్తి
పుర పోరు నేపథ్యంలో ఇటీవల ఓటరు ముసాయిదా విడుదల
ఓటరు ముసాయిదా జాబితాపై వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి పరిశీలన చేస్తున్నాం. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల సాధ్యాసాధ్యాలను, పొరపాట్లను సవరించి తుది జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నాం.
– జానకిరామ్‌సాగర్, కమిషనర్, గద్వాల
గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచురించిన వార్డుల వారీ ఓటరు ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించారు. జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించారు. అయితే వీటిపై జిలాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. వివిధ వార్డులలో వేర్వేరు కాలనీలకు చెందిన నివాస ఓటర్లను మరో వార్డులోకి పెద్ద సంఖ్యలో కలపడం, ఒకే కాలనీకి చెందిన నివాస ప్రాంతాలను విభజించడంపై వచ్చిన ఫిర్యాదులపై ప్రధానంగా దృష్టి సారించారు. విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న అభ్యంతరాలను సవరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. వివిధ కాలనీలలో నివాస గృహాల ఓటర్ల సరళి, విస్తరించిన తీరు, సమీపంలోని వార్డులలో కలపడం లేదా తొలగించడం వంటి అంశాలతో పాటు ఫిర్యాదులో పేర్కొన్న అభ్యంతరాల తీవ్రత, వాటి ప్రభావం తదితర అంశాలను పరిశీలించారు. వీటన్నింటిని మదింపు చేసి ఈ నెల 12న తుది జాబితాపై తయారీకి సమాయత్తమవుతున్నారు.
అనుకూలతలే ప్రామాణికంగా ఫిర్యాదులు
గద్వాల మున్సిపాలిటీలో వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాల్లో ఎక్కువగా ఆశావహుల అనుకూలతలే ప్రామాణికంగా ఫిర్యాదులు వచ్చాయి. తమకు సంబంధించిన ఓటర్లు ఇతర వార్డులకు వెళ్లడం, వార్డుల్లో కుల సమీకరణలు మారితే రిజర్వేషన్లపై ప్రభావం చూపడం తదితర అంశాల ప్రాతిపదికన నాయకులు విజ్ఞాపనలు అందజేసినట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమవుతుంది. ఇవి కాక పట్టణంలో ప్రధానంగా 07, 16, 17, 30వ వార్డుల పరిఽధిలో ఓటర్లను గంపగుత్తగా ఇతర వార్డులకు బదలాయించారని ఎక్కువగా అభ్యంతరాలు రావడంతో ప్రతి ఫిర్యాదుపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ఇంటి నంబరు, ఓటర్లు ఉన్నారా లేదా అనే వాటిపై ఆరా తీశారు. వార్డు సమీపంలో ఉన్న ఓటర్లను దూరంగా ఉన్న మరో వార్డులోకి చేర్చడం వంటి వాటిపై కూడా ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని వార్డులలో ఉన్న ఓటర్ల వ్యత్యాసంపై కూడా దృష్టి సారించారు. వార్డు లలో ఓటర్ల వ్యత్యాసం హెచ్చు తగ్గులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్ల సంఖ్యను సమ న్వయం చేయడానికి కొన్ని ప్రాంతాలను వార్డు మ్యా పింగ్ ద్వారా విభజన చేస్తున్నారు. ప్రధానమైన అభ్య ంతరాలను ఇప్పటికే పరిష్కరించామని, ప్రక్రియ తు ది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు.
మున్సిపాలిటీలు వార్డులు ఫిర్యాదులు
గద్వాల 37 36
అయిజ 20 53
అలంపూర్ 10 00
వడ్డేపల్లి 10 56
ఓటరు ముసాయిదాపై వచ్చిన విజ్ఞాపనల్లో పలు ప్రాంతాలను కలపడం, విడగొట్టడంపై అధికారులు ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక వార్డులో పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లను, మరో వార్డులో చేర్చడంపై మరోసారి కసరత్తులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక్కడే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వార్డు ఓటర్లను సరిచేసే ప్రయత్నంలో మరో వార్డుకు చిక్కులు వస్తున్నాయి. ముసాయిదాలో జరిగిన లోపాలు, సవరించే అవకాశాలపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక కొలిక్కి తెచ్చారు. వీటిని మరోసారి సమీక్షించి, వార్డుల వారీ ఓటర్లతో పాటు పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మార్పు చేర్పులకు ఓటర్ల నుంచి
పెద్ద ఎత్తున ఫిర్యాదులు
క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన
అధికారులు
12న తుది జాబితా తయారీకి సమాయత్తం
ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులు
ముసాయిదా జాబితాలో కొంతమేర మార్పులు, చేర్పులు, జరిగే అవకాశం ఉందనే ఊహగానాలు వస్తుండటంతో ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. సరిహద్దులు, ఓటర్ల మార్పు ఏ విధంగా ఉంటుందనే విషయాలపై కూడికలు, తీసివేతలు చేసుకుంటున్నారు. మొత్తానికి అభ్యంతరాల పరిశీలనలో ఎన్ని తిరస్కరిస్తారు..? ఎన్ని పరిష్కరిస్తారనేది చూడాల్సి ఉంది.
పునఃపరిశీలన
పునఃపరిశీలన


