సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధం
● రీజియన్ నుంచి
అదనపు బస్సులు
● హైదరాబాద్ నుంచి డిపోల వైపు
430
సర్వీసులు
● నేటినుంచి ప్రారంభం కానున్న
రాకపోకలు
స్టేషన్ మహబూబ్‌నగర్: పల్లె సంస్కృతి ప్రతిబింబించే సంక్రాంతి పండుగకు ఎక్కడున్న వారి స్వస్థలాలకు రావడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, శ్రామికులు ఈ పండుగకు ఇళ్లకు వచ్చి మూడు రోజులు జరిగే పండుగ సంబరాలను ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 10 డిపోల నుంచి అదనపు బస్సులను నడపనున్నారు. శుక్రవారం నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్‌లోని పది డిపోలకు 430 బస్సులు నడపనున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌కు అదనపు సర్వీసులు నడపడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఈ రూట్లోనే ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు.
తిరగనున్న బస్సు సర్వీసులు
డిపో
అచ్చంపేట 7 11 11 7 11
గద్వాల 7 11 11 7 11
కల్వకుర్తి 7 11 11 7 11
కొల్లాపూర్ 6 10 10 6 10
కోస్గి 2 3 3 2 3
మహబూబ్‌నగర్ 8 11 11 8 11
నాగర్‌కర్నూల్ 7 10 10 7 10
నారాయణపేట 7 11 11 7 11
షాద్‌నగర్ 7 11 11 7 11
వనపర్తి 7 11 11 7 11
తిరుగు ప్రయాణంలో డిపోల నుంచి హైదరాబాద్ వైపు
డిపో 17న 18న 19న 20న 21న
అచ్చంపేట 7 11 11 7 5
గద్వాల 7 10 10 7 5
కల్వకుర్తి 7 11 11 7 5
కొల్లాపూర్ 5 8 8 5 4
కోస్గి 2 3 3 2 2
మహబూబ్‌నగర్ 7 10 10 7 5
నాగర్‌కర్నూల్ 7 10 10 7 5
నారాయణపేట 7 11 11 7 5
షాద్‌నగర్ 7 11 11 7 5
వనపర్తి 7 11 11 7 5


