గతంలో రెండు పంటలకు సాగునీరు.. | - | Sakshi
Sakshi News home page

గతంలో రెండు పంటలకు సాగునీరు..

Jan 9 2026 11:14 AM | Updated on Jan 9 2026 11:14 AM

గతంలో

గతంలో రెండు పంటలకు సాగునీరు..

గతంలో రెండు పంటలకు సాగునీరు.. నీరు ఇవ్వమన్నారు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు..

గతంలో అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందేది. గతేడాది యాసంగిలోనూ నీరు వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుత యాసంగిలో ఎత్తిపోతలకు నీటి సరఫరా నిలిపినట్లు అధికారులు ప్రకటించడంతో వ్యవసాయ పనులు మానుకున్నాం. పంట సాగుకు దూరమై నష్టపోతున్నాం.

– కడియాల నర్సింహులు, రైతు, అమరచింత

ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాసంగిలో పంటల సాగుకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు ప్రకటించారు. సాగునీరు అందించాలని ఏఈలు, ఈఈలకు విన్నవించాం. జూరాలలో నిల్వ నీటిమట్టం తగ్గుతున్నందున వేసవిలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జూరాలలో సమృద్ధిగా నీరు నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

– ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి,

అమరచింత ఎత్తిపోతల పథకం

ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరచింత, చంద్రగఢ్‌ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాస ంగిలో సాగునీరు ఇవ్వలేమని ముందస్తుగా ప్రకటించాం. ఈ విషయాన్ని సంబంధిత ఎత్తిపోతల నిర్వహణ కమిటీ సభ్యులకు వివరించాం. జూరాలలో ప్రస్తుతం 4 టీఎంసీలు మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా నిలిపివేశాం.

– జగన్మోహన్‌, ఈఈ,

జూరాల ఎడమకాల్వ విభాగం

గతంలో రెండు పంటలకు సాగునీరు.. 
1
1/2

గతంలో రెండు పంటలకు సాగునీరు..

గతంలో రెండు పంటలకు సాగునీరు.. 
2
2/2

గతంలో రెండు పంటలకు సాగునీరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement